'కోహ్లి రొటేషన్ పాలసీ బాగుంది'

28 Oct, 2017 13:02 IST|Sakshi

న్యూఢిల్లీ:గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో రొటేషన్ పద్ధతిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో రొటేషన్ పాలసీని పదే పదే పాటిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రొటేషన్ పద్ధతికి అనుకూలంగా ఉండటంతో సీనియర్ క్రికెటర్లు సైతం తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనికి కారణమైన టీమిండియా కెప్టెన్ కోహ్లికి మద్దతు ప్రకటించాడు భారత పేసర్ మొహ్మద్ షమీ.

'కోహ్లి అనుసరిస్తున్న రొటేషన్ పాలసీ చాలా బాగుంది. దీనివల్ల నాలాంటి వారికి కచ్చితంగా లబ్ది చేకూరుతుంది. ఆటగాళ్లు గాయాల బారినపడినప్పుడు వారికి విశ్రాంతి దొరకడమే కాకుండా మళ్లీ జట్టులో చోటుపై కూడా భరోసా ఉంటుంది.విరాట్ కోహ్లి రొటేషన్ పాలసీకి నా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఈ విధానాన్ని కేవలం  టెస్టులకు మాత్రమే కాకుండా అన్ని ఫార్మాట్లలో అవలంభించడం వల్ల ఎవరికీ నష్టం జరగదు' అని షమీ తెలిపాడు.

మరిన్ని వార్తలు