ఇండోర్‌ క్రికెట్‌ రూల్స్‌ కాస్త చెప్పండి: షమీ

30 May, 2020 12:47 IST|Sakshi
మహ్మద్‌ షమీ(ఫైల్‌ఫొటో)

లక్నో: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెటర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. దీంతో సోషల్‌ మీడియా బాట పట్టారు చాలామంది క్రికెటర్లు. తమకు నచ్చిందో ఏదో చేసేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ఒక వీడియోను షేర్‌ చేశాడు. ఇంటిలోనే క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియోను తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఇక్కడ షమీ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. సోదరుడు బౌలింగ్‌ చేస్తుండగా షమీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అయితే షమీ పోస్ట్‌ చేసిన వీడియోకు రూల్స్‌ చెప్పాలంటూ విన్నవించాడు. (స్టోక్స్‌ కోసం ఏమైనా రూల్స్‌ మార్చారా?)

ఇండోర్‌ క్రికెట్‌ గేమ్స్‌ రూల్స్‌ గురించి కాస్త చెప్పండి అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. తనకు ఇండోర్‌ క్రికెట్‌ రూల్స్‌ గురించి తెలుసుకోవాలని ఉందని పేర్కొన్నాడు. దీనిపై మాజీ పేసర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ స్పందించాడు. ‘నీకు తర్వాత బౌలింగ్‌ ఎవరు చేశారు’ అని షమీని ప్రశ్నించాడు. కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్‌ ఈవెంట్లన్నీ రద్దయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిప్పుడే క్రికెట్‌ పునరుద్ధణ చర్యలు చేపట్టాయి కొన్ని క్రికెట్‌ బోర్డులు. అయితే భారత్‌లో జరగాల్సిన ఉన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)పై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడింది. దీనిపై బీసీసీఐ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ఐపీఎల్‌ జరగని పక్షంలో వేల కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కోసం ఆందోళన చెందుతున్నారు. (‘మైండ్‌ బ్లాక్‌’తో వచ్చిన వార్నర్‌..)

మరిన్ని వార్తలు