అమల్‌రాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారం

4 Jun, 2019 14:01 IST|Sakshi

మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ నుంచి గౌరవం

సాక్షి, హైదరాబాద్‌: తమ జట్టుకు విశేష సేవలందించిన భారత ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ క్లబ్‌ మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ (ఎంఎస్‌సీ) గొప్ప గౌరవంతో సత్కరించింది. ఆయన సేవలను కొనియాడుతూ అమల్‌రాజ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ అందజేసింది. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఫిర్హాద్‌ హకీమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి అమల్‌రాజ్‌కు అవార్డును అందజేశారు.

భారత ఫుట్‌బాల్‌ జట్టుకూ సారథ్యం వహించిన ఆయన ... మొహమ్మదాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు 6 పర్యాయాలు ఆడారు. 1980లో ఎంఎస్‌సీ కెప్టెన్‌గా ఎంపికై పలు టోర్నమెంట్‌లలో జట్టును విజేతగా నిలిపారు. 1978, 1979, 1980, 1983, 1985, 1989లలో అమల్‌రాజ్‌ ఎంఎస్‌సీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అమల్‌రాజ్‌ భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ)లో డీజీఎం హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. 
.
 

>
మరిన్ని వార్తలు