నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ టీమ్‌ సీఎస్‌కే: మూడీ

4 Apr, 2020 20:38 IST|Sakshi

నా బెస్ట్‌ కెప్టెన్‌ ధోని

ఫేవరెట్‌ క్రికెటర్‌ మాత్రం కోహ్లి

మెల్‌బోర్న్‌: టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌లే టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్లని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఓపెనర్లు ఎవరైనా ఉన్నారంటే వార్నర్‌, రోహిత్‌లేనని మూడీ తెలిపాడు. టీ20 క్రికెట్‌లో బెస్ట్‌ ఓపెనర్లు ఎవరని ట్వీటర్‌లో మూడీని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రోహిత్‌, వార్నర్‌ల పేర్లు ఎంచుకున్నాడు మూడీ. ఇది నిజంగా కష్టమైన ప్రశ్న అయినప్పటికీ ఆ ఇద్దరే తాను చూసిన ఉత్తమ ఓపెనర్లన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెండు వన్డేలు మాత్రమే ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ మోస్ట్‌ ఎమెర్జింగ్‌ ప్లేయర్‌ అని మూడీ తెలిపాడు.(‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’)

ఇక మీ ఫేవరెట్‌ టీమిండియా క్రికెటర్‌ ఎవరు అని ప్రశ్నించగా విరాట్‌ కోహ్లి అని సమాధానమిచ్చాడు. ఎంఎస్‌ ధోనిని బెస్ట్‌ కెప్టెన్‌గా ఎంచుకున్నాడు మూడీ. అదే సమయంలో తన ఫేవరెట్‌ ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)అని మూడీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న సీఎస్‌కే తన ఫేవరెట్‌ టీమ్‌ అని తెలిపాడు. భారత ఫీల్డర్ల విషయాని కొస్తే రవీంద్ర జడేజా అత్యుత్తమం అని మూడీ మనసులోని మాటను వెల్లడించాడు. బెస్ట్‌ క్రికెటింగ్‌ బ్రెయిన్స్‌ జాబితాలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు మూడీ ఓటేశాడు. ట్వీటర్‌లో క్వశ్చన్‌ అండ్‌ అన్సర్స్‌ సెషన్స్‌లో పాల్గొన్న మూడీ.. యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానమిచ్చాడు. (కోహ్లిని వద్దన్న ధోని..!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా