మోర్కెల్ కు ఆరు వారాల విశ్రాంతి!

3 Oct, 2017 13:16 IST|Sakshi

పోష్‌స్ట్రూమ్‌: దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఆరు వారాల పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్న మోర్కెల్.. ఉన్నపళంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో భాగంగా ఆదివారం నాల్గో రోజు ఆటలో 5.2 ఓవర్లు ముగిసిన తరువాత మోర్కెల్ ఫీల్డ్ ను వదిలివెళ్లిపోయాడు. 'ప్రస్తుతం మోర్కెల్ ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి నాలుగు  వారాల నుంచి ఆరు వారాల వరకూ విశ్రాంతి అవసరం. మోర్కెల్ కు స్కానింగ్ చేయించిన తరువాత ఈ విషయం బయటపడింది. దాంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరం కానున్నాడు'అని టీమ్ డాక్టర్ మొహ్మద్ ముసాజీ తెలిపారు.

ఇప్పటికే ముగ్గురు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. డేల్ స్టెయిన్, ఫిలిండర్, క్రిస్ మోరిస్ లు గాయాలు కారణంగా దూరం కాగా, తాజాగా వారి జాబితాలో మోర్కెల్ చేరిపోయాడు.

మరిన్ని వార్తలు