క్రీడా స్ఫూర్తికే అవమానం.. జీవితకాల నిషేధం

11 Sep, 2018 11:17 IST|Sakshi

రోమ్: ఏ క్రీడలోనైనా క్రీడా స్ఫూర్తి అనేది అనివార్యం. ఒకవేళ గెలుపు కోసం అడ్డదారులు తొక్కితే అందుకు తగిన మూల్యం భారీగానే ఉంటుంది. ఇలానే ఒక రేసర్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యహరించి జీవితకాలం నిషేధానికి గురయ్యాడు.

ఇటలీలోని సాన్‌ మారినోలో నిర్వహించిన ఒక బైక్ రేస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇది బైక్ రేసులకే సవాల్‌గా పరిణమించింది. ఈ బైక్ రేసులో ఒక రైడర్ తన ప్రత్యర్థిని ఓడించేందుకు అతని బైక్ హ్యాండ్‌ బ్రేక్‌ను నొక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ బైక్ 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

కొద్దిగా పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగివుండేది. ‘ఇటాలియన్ మోటో జిపీ-2’కు చెందిన రొమానే ఫెనటీ... జాన్ మెరీనోరైడ్ సందర్భంలో ప్రత్యర్థి స్టెఫానో మంజీ బైక్ బ్రేక్‌ను ఒత్తి అతనిని పడవేసేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం కారణంగా అతను రేసింగ్ గేమ్ ఆడకుండా జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెనాటీని ఈ రేస్ నుంచి తప్పించారు. అలాగే రేసింగ్ గేమ్ నిర్వాహకులు... ఫెనాటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు