ధోని పేరిట చెత్త రికార్డు.!

8 Jul, 2019 13:21 IST|Sakshi

లండన్‌ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఈ ప్రపంచకప్‌ ఏ మాత్రం అచ్చిరాలేదు. ఇప్పటికే స్లో బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లలో నానుతున్న ధోని.. తాజాగా మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అది కూడా కీపింగ్‌ విషయంలో కావడం గమనార్హం. ధోని అంటే ప్రపంచశ్రేణి వికెట్‌ కీపర్‌. అతను వికెట్ల వెనుకాల ఉంటే ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా క్రీజు దాటి సాహసం చేయరు. అలాంటి ధోని కీపింగ్‌లో చురుకుదనం, వేగం తగ్గింది. దీంతో బైస్‌ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న వికెట్‌ కీపర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

ఈ మెగాటోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన ధోని ఏకంగా బైస్‌ రూపంలో 24 పరుగులు ఇచ్చాడు. టోర్నీ మొత్తం బైస్‌ రూపంలో 71 పరుగులే రాగా.. ధోని ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం అతని కీపింగ్‌ లోపాన్ని తెలియజేస్తుంది. ఇక ధోని తర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్‌ కీపర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా..9 ఔట్లతో ధోని 9 స్థానంలో ఉన్నాడు.  శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే ధోని 4 ఔట్లలో భాగమయ్యాడు. దీంతో ఈ ఘనతనందుకున్న మూడో భారత వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ధోని కన్నా ముందు ఐదు ఔట్లతో నయాన్‌ మోంగియా, సయ్యద్‌ కిర్మాణి ఉన్నారు.

  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు