సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

22 Jul, 2019 18:00 IST|Sakshi

ధోని సైన్యంలో చేరడంపై పెదవి విరుపు

రిటైర్మెంట్‌ చర్చను పక్కకు పెడుతూ.. వెస్టిండీస్‌ పర్యటనకు సెలవిస్తూ ప్రాదేశిక సైన్యలోకి చేరాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ధోనికి దేశభక్తి ఎక్కువ.. అంటూ క్రికెట్‌ భారతం ఉబ్బితబ్బిబ్బై పోతుంది. పలు సందర్భాల్లో దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను నెమరవేసుకుంటోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్‌.. ధోనిని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వారందరిని ఆగ్రహానికి గురిచేసింది. 

ధోని తన సమయాన్ని ఆర్మీకి కేటాయించబోతున్నాడంటూ వచ్చిన వార్తల పట్ల ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ‘కాల్ ఆఫ్ డ్యూటీ.. సైన్యంలో చేరే ఉద్దేశంతో ధోని విండీస్‌ పర్యటనకు దూరం కానున్నాడు’ అంటూ ఓ స్పోర్ట్స్ చానెల్‌ చేసిన ట్వీట్‌కు ఎగతాళిగా పశ్చాతాపంతో నవ్వుతున్నట్టుగా ఉన్న ఎమోజీలతో రీట్వీట్ చేశాడు. ఇది భారత అభిమానులకు ఎక్కడ లేని ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే సోషల్‌ మీడియా వేదికగా ఈ ఇంగ్లీష్‌ మాజీ క్రికెటర్‌పై ట్రోలింగ్‌కు దిగారు. ‘9 టెస్ట్‌లు ఆడిన నువ్వా.. మా ధోని గురించి మాట్లాడేది’ అని ఒకరంటే.. ఈ ముసలాయనకు పళ్లతో పాటు మెదడు కూడా లేనట్టుందని మరొకరు ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జన్మించిన డేవిడ్ లాయడ్ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. భారత్‌పై తొలి టెస్టు ఆడిన డేవిడ్‌.. విండీస్‌పై తొలి వన్డే, చివరి వన్డే ఆడాడు. అనంతం కామెంటెటర్‌‌గా బాధ్యతలు చేపట్టాడు.

చదవండి: ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర! 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్‌’ ప్రదర్శన

శివ థాపా పసిడి పంచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్స్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’