ధోని ‘చేపల వేట’

4 Feb, 2015 17:22 IST|Sakshi
ధోని ‘చేపల వేట’

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ ధోని ఆస్ట్రేలియాలో చేపల వేట మొదలుపెట్టాడు. అవును... అడిలైడ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడ్వెంచర్ పార్క్‌కు ధోని వెళ్లాడు. ట్రెక్కింగ్, ఫిషింగ్, బోటింగ్‌తో పూర్తిగా క్రికెట్‌కు దూరంగా రెండు రోజులు గడుపుతున్నాడు. ధోనితో పాటు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ కూడా ఈ పార్క్‌కు వెళ్లారు. ఈ నలుగురూ తిరిగి 5వ తేదీన జట్టుతో చేరతారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
 
మరోవైపు స్టువర్ట్ బిన్నీ తన అక్క కుటుంబంతో సమయం గడిపేందుకు సిడ్నీ వెళ్లగా... శిఖర్ ధావన్ మెల్‌బోర్న్ వెళ్లి తన భార్యాపిల్లలతో సమయం గడుపుతున్నాడు. భారత క్రికెటర్లు ఐదు రోజుల పాటు క్రికెట్‌కు పూర్తి దూరంగా సరదాగా గడపాలని నిశ్చయించుకోవడంతో ఇలా తలా ఓ దారి చూసుకున్నారు. అయితే ఈ ఆరుగురు మినహా మిగిలిన క్రికెటర్లంతా అడిలైడ్‌లోనే ఉన్నారు. కొంతమంది షాపింగ్‌కు వెళ్తే, మరికొంత మంది జిమ్‌లో సమయం గడిపారు.

మరిన్ని వార్తలు