ఇషాన్‌ అలా కాదు..ఇలా : ధోని

29 Apr, 2018 14:40 IST|Sakshi
ఇషాన్‌కు కీపింగ్‌ టిప్స్‌ ఇస్తున్న ధోని

కోచ్‌ అవతారమెత్తిన ధోని

పుణే : టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నెం1 కీపర్‌ అన్న విషయం తెలిసిందే. వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కీపర్‌గా ధోని ఉంటే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటలంటే సంశయిస్తారు. అలాంటి ధోని కోచ్‌గా అవతారమెత్తాడు.

శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషాన్‌కు కీపింగ్‌ మెళకువలు నేర్పించాడు. విషయం ఏంటంటే.. మ్యాచ్‌లో ఇషాన్‌ కిషాన్‌కు ధోనిని స్టంప్‌ ఔట్‌ చేసే అవకాశం వచ్చింది. కానీ ధోని అప్రమత్తం కావడంతో ఆ అవకాశం చేజారింది. ఇక ఇదే విషయంపై మ్యాచ్‌ అనంతరం ధోని ఈ యువ కీపర్‌కు కొన్ని సూచనలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

Learning a trick or two from the best in the business! The Jharkhand boys - @ishankishan23 and MS Dhoni bond after the game. #CricketMeriJaan #MumbaiIndians #CSKvMI

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

మరిన్ని వార్తలు