‘కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌ అతడే’

3 Oct, 2018 20:19 IST|Sakshi

ధోనియే తన ఫేవరెట్‌ అన్న హాంగ్‌కాంగ్‌ బౌలర్‌ ఇహ్సన్‌ ఖాన్‌

ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచులో మిస్టర్‌ కూల్‌ ధోనిని ఔట్‌ చేయడం ద్వారా తన చిరకాల కోరిక నెరవేరిందని హాంగ్‌కాంగ్‌ బౌలర్‌ ఇహ్సాన్‌ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. త్వరలోనే తన కెరీర్‌ గురించి ఓ పుస్తకం రాయబోతున్నానని, అందులో ఎక్కువ భాగం ధోని గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు ఈ ఆఫ్‌ స్పిన్నర్‌. బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఇహ్సాన్‌... ‘  సచిన్‌ క్రికెట్‌ దేవుడు అయితే ఎంఎస్‌ ధోని క్రికెట్‌ కింగ్‌. వీరిద్దరిని ఒక్కసారైనా అవుట్‌ చేస్తే చాలు నా కెరీర్‌ పరిపూర్ణమైనట్లే అని భావించాను. అయితే సచిన్‌ను అవుట్‌ చేసే అవకాశం నాకు లభించలేదు. ఆసియా కప్‌ పుణ్యమాని ధోనిని పెవిలియన్‌కు పంపే అదృష్టం నాకు దక్కింది. అది నాకెంతో గర్వకారణం. ఈ విషయాలన్నీ నా పుస్తకంలో రాసుకుంటాను. నా మనువలకు కూడా ఇదంతా తెలియాలి కదా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

కాగా హాంగ్‌కాంగ్‌ తరపున ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ 29 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచులో ధోనిని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించి వార్తల్లో నిలిచాడు. అయితే స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ధోనిని అవుట్‌ చేసిన ఇహ్సన్‌ ఖాన్‌ ఓ స్కూలు టీచర్‌ అన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.


ధోనితో ఇహ్సన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు