ధోని@ 6, 6, 6, 6 ,6

6 Mar, 2020 17:45 IST|Sakshi

చెన్నై : మహేంద్ర సింగ్‌ ధోనీ తన బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. వరుసగా 5 బంతులను ఐదు సిక్సులుగా మలిచి బ్యాటింగ్‌ పవరేంటో చూపించాడు.దీంతో  ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేడియం దద్దరిల్లింది. అదేంటీ... ధోనీ ఎప్పుడు మ్యాచ్‌ ఆడాడు.. ఎప్పుడు సిక్స్‌లు కొట్టాడనేగా మీ సందేహం..  అక్కడికే వస్తున్నాం.  మరో మూడు వారాల్లో 13 ఐపీఎల్‌ సీజన్‌ మొదలవనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. కాగా సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ చిదంబరం స్టేడియంలో తన బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మహీ నెట్స్‌లోనే నిలబడి వరుసగా 5 బంతులను సిక్స్‌లుగా మలిచి స్టాండ్స్‌లోకి పంపాడు. అయితే బౌలర్‌ ఆ బంతులు వేశాడా లేక బౌలింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చిన బంతులను సిక్స్‌లుగా కొట్టాడా అనేది తెలియదు.(భజ్జీ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ జట్టు ఇదే..)

ధోనీ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోనూ తమిళ స్టార్‌స్పోర్ట్స్‌ చానెల్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అయితే  38 ఏళ్ల ధోనీలో ఇంకా బ్యాటింగ్‌ పవర్‌ తగ్గలేదని మాత్రం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడెప్పుడు ఐపీఎల్‌ 13 సీజన్‌లో తన ప్రదర్శన చూపించాలనే ఆసక్తిలో ధోనీ ఉన్నట్లు తెలుస్తుంది. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌లో ధోనీ ప్రదర్శనను చూడాలని అతని అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.కాగా  2019 వన్డే ప్రపంచకప్‌లో  కివీస్‌తో  జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం మహీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ధోనిని బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. దాదాపు 8నెలలు తర్వాత ఐపీఎల్‌ 13వ సీజన్‌ ద్వారా మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.   ధోనీ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 190 మ్యాచులాడి 4432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో చెన్నైకి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై.. ఐదు సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ప‌దేళ్లు ఈ సీజ‌న్‌లో ఆడిన చెన్నై.. ప‌దిసార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుని తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఈ జ‌ట్టును ముందుండి నడిపించడమే ఈ విజయ పరంపరకు అసలు కారణం. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది.
('కష్టకాలంలో నాకు అండగా నిలిచింది')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు