ప్రపంచకప్‌: 'ధోనికి గ్యారెంటీ లేదు'

14 Aug, 2017 19:39 IST|Sakshi
ప్రపంచకప్‌: 'ధోనికి గ్యారెంటీ లేదు'

న్యూఢిల్లీ: నిరాశాజనకమైన పర్ఫార్మెన్స్‌తో భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ త్వరలో భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారా?. బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ సోమవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌లో చెప్పిన విషయాలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయి. 2019లో జరగనున్న ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే నాలుగు ఐదు నెలల్లో ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటామని చెప్పారు.

భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌లలో వారినే ఆడిస్తూ రొటేట్‌ చేస్తామని తెలిపారు. తద్వారా ప్రపంచకప్‌కు పూర్తి సన్నద్ధతతో వెళ్లాలని ఓ పాలసీని తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు యువరాజ్‌ సింగ్‌ ఎంపిక కాకపోవడంపై కూడా ఎమ్‌ఎస్‌కే మాట్లాడారు. ఆయనకు విశ్రాంతినివ్వాలని భావించే జట్టులోకి ఎంపిక చేయలేదని తెలిపారు.

ప్రపంచకప్‌లో ధోనిని ఆడిస్తారా?
ప్రపంచకప్‌లో ధోనిని ఆడిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌.. ఎవరైతే ఫిట్‌గా ఉంటారో వారే ఫైనల్‌ స్క్వాడ్‌లో ఉంటారని సమాధానం ఇచ్చారు. అందరితో పాటే ధోని కూడా పరుగులు చేయాలని చెప్పారు.

మరిన్ని వార్తలు