'అందులో ధోనీ తప్పేమీలేదు'

20 Jun, 2015 20:06 IST|Sakshi
'అందులో ధోనీ తప్పేమీలేదు'

ఢాకా: బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్-భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి.. ధోనీకి మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటనలో ధోనీ తప్పేమీలేదంటూ రవిశాస్త్రి సమర్థించాడు.

మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం బంగ్లాతో జరిగిన తొలి వన్డే సిరీస్ సందర్భంగా ముస్తాఫిజుర్ను ధోనీ ఢీకొనడం వివాదమైన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ చర్యల కింది ధోనీ మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానాగా విధించారు. ధోనీ ఉద్దేశపూర్వకంగా ముస్తాఫిజుర్ను ఢీకొనలేదని రవిశాస్త్రి తెలిపాడు. వీడియో ఫుజేజ్లో ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఈ వివాదాన్ని తేలికపరిచేందుకు ప్రయత్నించాడు. ఆటలో ఇలాంటి సంఘటనలు జరగడం మామూలేనని రోహిత్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు