200 సిక్సర్లు బాదాడు!

2 Mar, 2016 08:55 IST|Sakshi
200 సిక్సర్లు బాదాడు!

మిర్పూర్: టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200 సిక్సర్లు బాదిన కెప్టెన్ గా 'మిస్టర్ కూల్' నిలిచాడు. ఇంకే కెప్టెన్‌ ఈ ఘనత సాధించలేదు. ఆసియాకప్ టి20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ధోని ఈ రికార్డు సాధించాడు.

హార్ధిక పాండ్యా అవుటైన తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ 'విన్నింగ్ షాట్ల స్పషలిస్ట్' తన శైలిలో మిలింద సిరివదర్దన బౌలింగ్ లో సిక్సర్ బాది 200 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో టాప్ లో నిలిచాడు. రికీ పాంటింగ్(171), బ్రెండన్ మెక్ కల్లమ్(170), క్రిస్ గేల్(134), సౌరవ్ గంగూలీ(132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిలో గేల్ తప్ప మిగతా ముగ్గురు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగారు.

కోహ్లి జోరు
ధోని దీటుగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది టి20ల్లో తన బ్యాటింగ్ సగటు సెంచరీ దాటించాడు కోహ్లి. శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి సగటు 103.66కు చేరింది. బ్యాటింగ్ సగటులో అతడే టాప్ లో ఉన్నాడు. టి20ల్లో శ్రీలంకపై మూడో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి.. గత ఆరు ఇన్నింగ్స్‌లో 4 అర్ధసెంచరీలతో 311 పరుగులు సాధించాడు. మూడుసార్లు అజేయంగా నిలిచాడు.

>
మరిన్ని వార్తలు