సాక్షి తెగ ఇబ్బంది పడింది!!

17 Dec, 2019 10:39 IST|Sakshi

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని తన భార్య సాక్షిని ఆటపట్టిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యాడ్‌ కోసం రూపొందించిన డైలాగ్‌ను సాక్షి ప్రాక్టీస్‌ చేస్తుంటే.. మిస్టర్‌ కూల్‌ తనను ఏడిపిస్తున్న వీడియోను ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ బ్లాస్ట్‌ ఫ్రమ్‌ ది పాస్ట్‌’ అనే క్యాప్షన్‌తో ధోని షేర్ చేసిన ఈ వీడియోకు.. ‘ఈ సంఘటన జరిగి ఏడాదిపైనే అవుతుంది. ఒక్క టేక్‌లో పూర్తి చేయాల్సిన డైలాగ్‌ను చదివేందుకు సాక్షి తెగ ఇబ్బందిపడుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశాడు. కాగా ఈ వీడియోలో.. నగదు చెల్లింపులకు సంబంధించిన ఓ ప్రకటన డైలాగ్‌ పేపర్‌లో రాసి ఉంది. దానిని చూసి కూడా సాక్షి సరిగా చదవలేకపోయారు. అది చూసి పక్కనే ఉన్న ధోని .. ‘ఇంతటి సులభమైన డైలాగ్‌ను చూసి కూడా చదవలేక పోతున్నావు.. ఇంకా ఎలా చెప్తావు’ అంటూ సాక్షిని ఆటపట్టించాడు. ధోని.. ముద్దుగా తన భార్యను మందలించిన ఈ వీడియో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియోకు ఫిదా అవుతూ నెటిజన్లంతా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Blast from the past.when u turn the table and ask the director to deliver the dialogue specially when she keeps saying such an easy dialogue u shd do it in one take.time flies this was more than an Year back.

A post shared by M S Dhoni (@mahi7781) on

ఇక ధోనీ 2019 ప్రపంచ కప్‌ తర్వాత తిరిగి మైదానంలో కనిపించలేదు. దీనిపై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రీ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..  ధోనీ వచ్చే ఏడాది ‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ ఆడిన తర్వాత జట్టులో కొనసాగుతాడా లేదా అన్న విషయంపై స్పష్టతనిస్తాడని, అప్పుడు  ధోని నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా