క్రికెటర్ల పండగ

1 Nov, 2016 10:59 IST|Sakshi
క్రికెటర్ల పండగ

న్యూఢిల్లీ: విరామం దొరకడంతో టీమిండియా ఆటగాళ్లు వేడుకల్లో మునిగి తేలుతున్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ ముగియడంతో భారత క్రికెటర్లకు ఖాళీ దొరికింది. దీంతో కుటుంబ సభ్యులతో క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. వరుస పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆటగాళ్లకు కాస్త విరామం లభించడంతో ఈ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తున్నారు. దీపావళికి ముందు రోజు కివీస్ తో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకున్నారు.

ఎంఎస్ ధోని తన భార్య, కూతురు కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. పండుగ సందర్భంగా తీసుకున్న ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ దీపావళి ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవడం పట్ల అజింక్య రహానే ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన భార్య వేసిన ముగ్గు ఫొటో ఇన్ స్టామ్ లో పోస్టు చేసి అందరికీ దీపావళి విషెస్ చెప్పాడు. స్నేహితులతో కలిసి వీరు సరదాగా గడిపారు. హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకంక్షలు తెలిపాడు. అజింక్య రహానే తన భార్య వరుసగా ఐదు వారాలు మ్యాచ్ లు ఆడిన తర్వాత కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు విరామం దొరికిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

విదేశీ క్రికెటర్లు కూడా దీపావళి జరుపుకోవడం విశేషం. ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. తన పిల్లలతో పాటు తాను కూడా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పండగ చేసుకున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకున్నామని వెల్లడించాడు.

మరిన్ని వార్తలు