‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’

4 Apr, 2020 15:19 IST|Sakshi

హైదరాబాద్ ‌: సీనియర్‌ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ వసీం జాఫర్‌ సముచిత గౌరవాన్ని కల్పించాడు. వన్డేల్లో తన ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టును జాఫర్‌ ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు సారథిగా ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు. తన జట్టులో ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లితో పాటు ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్‌ అందించిన రికీ పాంటింగ్‌లు ఉన్నప్పటికీ ధోనికే సారథ్య బాధ్యతలను అప్పగించడం విశేషం. ఇక తన అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అయితే ఒక్క భారత బౌలర్‌ను కూడా ఎంపిక చేయలేదు.

ఓపెనర్లుగా సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మలు వ్యవహరిస్తారి పేర్కొన్న ఈ మాజీ ఓపెనర్‌ బ్యాటింగ్‌లో వన్‌డౌన్‌ కోసం కోహ్లిని కాకుండా వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వీవీఎన్‌ రిచర్డ్స్‌ వైపు మొగ్గు చూపాడు. అయితే కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పాడు. మిడిలార్డర్‌ పటిష్టపరచడానికి దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో పాకిస్తాన్‌ మాజీ సారథి వసీం ఆక్రమతో పాటు జోయల్‌ గార్నర్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్లలో సక్లాయిన్‌ ముస్తాక్‌, షేన్‌ వార్న్‌లలో పరిస్థితిక తగ్గట్టు ఎవరినో ఒకరు తుదిజట్టులో ఉంటాడని తెలిపాడు. ఇక ఆసీస్‌ దిగ్గజ సారథి రికీ పాంటింగ్‌ను 12వ ఆటగాడిగా వసీం జాఫర్‌ ఎంపిక చేశాడు.  ​

వసీం జాఫర్‌ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే..
ఎంఎస్‌ ధోని (సారథి, వికెట్‌కీపర్‌), సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, వీవీఎన్‌ రిచర్డ్స్‌, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, బెన్‌ స్టోక్స్‌, వసీం ఆక్రమ్‌, జోయల్‌ గార్నర్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, సక్లాయిన్‌ ముస్తాక్‌/షేన్‌ వార్న్‌, రికీ పాంటింగ్‌(12వ ఆటగాడు)

చదవండి:
ప్రపంచకప్‌ ఫైనల్‌ క్రెడిట్‌ ఎవరికి?.. రైనా క్లారిటీ!
ఆ క్షణం ఇంకా రాలేదు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా