సాక్షీ.. నీ ఐడియా సూపరో.. సూపర్‌

15 Nov, 2017 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని సతీమణి సాక్షిసింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు చాలా సమయం ఉండటంతో ధోని కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఫ్లైట్‌లో  కూతురు జీవాతో ఈ జంట ప్రయాణించింది.

ఫ్లైట్‌లోని ప్రయాణీకులకు ధోని కనబడితే ఇబ్బంది కలుగుతుందని భావించిన సాక్షి.. కనబడకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకేం చేసిందంటే మహీకి చుట్టూ టవల్‌ చుట్టేసింది. దీంతో ఎవరూ ధోని గుర్తించలేకపోయారు. ప్రయాణీకులు వెళ్లిన అనంతరం అబ్రక దబ్రా సాక్షి మాయా అంటూ ధోనిని చూపించింది. ఇలా రెండు వీడియోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలపై అభిమానులు వాటే ఐడియా.. అని కొందరూ..మీ వ్యక్తిత్వాన్ని దాచలేరని మరి కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక టీ20ల నుంచి తప్పుకోవాలని ధోనిపై వస్తున్న విమర్శల గురించి తెలిసిందే. 

మరిన్ని వార్తలు