ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లకు పనిష్మెంట్‌

3 May, 2018 19:23 IST|Sakshi
ఎమోజీలు ఉన్న జంప్‌ సూట్‌ ధరించిన ముంబై ఆటగాళ్లు

సాక్షి, ముంబై :  ఐపీఎల్‌-11లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌ జట్టు  తమ ఆటగాళ్లకు మరిన్ని శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సమయపాలన, నిబంధనలు పాటించని ఆటగాళ్లకు జట్టు మేనేజ్‌మెంట్‌ ఫన్నీ పనిష్మెంట్‌ విధిస్తోంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో కూడిన ఎమోజీలు ఉన్న జంప్‌ సూట్‌ను వేసుకోవాలి. దీంతో ఈ సీజన్‌లో తొలిసారిగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, అనుకూల్ రాయ్, రాహుల్ చహర్‌లు ఈ పనిష్మెంట్ భారిన పడ్డారు. ఈ జంప్‌సూట్లు వేసుకున్నారంటే వాళ్లు ఏదో తప్పు చేశారని మిగతావారికి అర్థమైపోతుంది. ఈ ప్లేయర్స్ ఎమోజీ సూట్లు వేసుకున్న వీడియోను ముంబై ఇండియన్స్ తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

‘రెండు రోజుల క్రితమే జిమ్‌ సెషన్‌ ఉందని చెప్పినా మరిచిపోవటంతో ఈ సూట్‌ వేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో సన్‌గ్లాసెస్‌ తీయలేకపోయాను. ఎవరి కళ్లలోకి చూడలేకపోయాను. ఏదో తప్పచేసిన భావన కలిగింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటాను’ అని ఇషాన్‌ కిషాన్‌ పేర్కొన్నాడు.  ప్రాక్టీస్‌ సెషన్‌కు సమయానికి రానందుకు ఈ పనిష్మెంట్‌కు గురయ్యానని రాయ్‌ తెలిపాడు. ఫిజియో రూమ్‌కు సమయానికి రాలేకపోయినందుకు ఈ స్పెషల్‌ కిట్‌ ధరించాల్సి వచ్చిందని రాహుల్‌ చహర్‌ వివరించాడు. 

   

మరిన్ని వార్తలు