లంకతో రెండో టెస్టు : రాణించిన విజయ్‌

25 Nov, 2017 11:48 IST|Sakshi

మురళీ విజయ్‌ ఆఫ్‌ సెంచరీ

వికెట్లకోసం చెమటోడ్చుతున్న లంక బౌలర్లు

శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా రాణిస్తోంది. భోజన విరామానికి 39 ఓవర్లలో 97పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. తొలిరోజు తక్కువ స్కోరుకే రాహుల్‌ వికెట్‌ కొల్పోయినా విజయ్, పుజారా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో నిలబడటానికి ప్రాధాన్యం ఇచ్చిన ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. భోజన విరామానికి పుజారా 33(92 బంతులు 5ఫోర్లు), మురళీ విజయ్‌ 56(129 బంతులు 6ఫోర్లు)లతో క్రీజులో ఉన్నారు.

తొలిరోజు 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్‌, పుజారాలు బలమైన పునాది వేశారు. రెండోరోజు అసలైన టెస్టుమ్యాచ్‌ మజాను క్రికెట్‌ అభిమానులకు అందించారు.  ఈదశలో విజయ్‌ 53 (112 బంతులు 6ఫోర్లు) హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 34 ఓవర్‌లో షనక వేసిన తొలిబంతిని బౌండరీకి తరలించడం ద్వారా మురళీ విజయ్‌ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది మురళీ విజయ్‌కు టెస్టు మ్యాచ్‌లో 16వ హాఫ్‌ సెంచరీ. మరోవైపు వికెట్లకోసం లంక బౌలర్లు చెమటోడుస్తున్నారు.


లంక తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 205పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలతోపాటు ఇశాంత్‌ శర్మ చెలరేగడంతో లంక స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది.

మరిన్ని వార్తలు