ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్

27 Jul, 2016 18:58 IST|Sakshi

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. మురళీతో పాటు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడ గొట్టిన మురళీ 2011 ప్రపంచకప్ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు