ముస్తాఫిజుర్కు లైన్ క్లియర్

1 Jul, 2016 20:04 IST|Sakshi
ముస్తాఫిజుర్కు లైన్ క్లియర్

ఢాకా: ఇంగ్లిష్ కౌంటీల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్న బంగ్లాదేశ్ యువ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) గురువారం ఆమోద ముద్ర వేసింది.  ముస్తాఫిజుర్  శారీరక స్థితిపై డాక్టర్లు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో అతను ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది.  గత కొంత కాలం నుంచి ముస్తాఫిజుర్ ఇంగ్లిష్ కౌంటీ్ల్లో ఆడేందుకు ఆసక్తి కనబరిచినా.. అతను వరుసగా బిజీ షెడ్యూల్ తో గడపడంతో  బీసీబీ ఆచితూచి నిర్ణయం తీసుకుంది. దీనిలో  భాగంగా ముస్తాఫిజుర్ ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి పరీక్షలు చేయించింది.

'ముస్తాఫిజుర్ ఫిట్నెస్పై పాజిటివ్ రిపోర్టు వచ్చింది.  దీంతో అతను ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడేందుకు బోర్డు అంగీకరించింది. వీసాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తయితే జూలై 13వ తేదీన ఇంగ్లండ్కు బయల్దేరతాడు.యూకేలో అతని ఆట మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నాం'  అని బీసీసీ అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు.

మరిన్ని వార్తలు