'టీమిండియాపై ఆఫ్ కట్టర్లు సంధిస్తా'

13 Jun, 2017 18:42 IST|Sakshi
'టీమిండియాపై ఆఫ్ కట్టర్లు సంధిస్తా'

బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్ తో తలపడబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ కట్టర్లు సంధిస్తానని అంటున్నాడు బంగ్లాదేశ్ ఆశాకిరణం ముస్తాఫిజుర్ రెహ్మాన్. ప్రస్తుతం ఇంగ్లండ్ లో పరిస్థితులు పేసర్లకు పెద్దగా అనుకూలించడం లేదని పేర్కొన్న ముస్తాఫిజుర్.. భారత్ తో జరిగే అమీతుమీ పోరులో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

 

'నా బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడంలో ముగింపు అనేది లేదు. నా ఆయుధం ఆఫ్ కట్టర్లే. కాకపోతే పేసర్లకు ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించడం లేదు. అయినప్పటికీ ఆఫ్ కట్టర్లు వేయడానికే శతవిధాలా ప్రయత్నిస్తా. నా శక్తివంచన లేకుండా బంగ్లాదేశ్ విజయానికి కృషి చేస్తా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి నిలిపా. అంతా మాకు మంచే జరుగుతుందని ఆశిస్తున్నా'అని ముస్తాఫిజుర్ తెలిపాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు గేమ్లు ఆడిన ముస్తాఫిజుర్ కేవలం వికెట్ మాత్రమే తీశాడు.

మరిన్ని వార్తలు