ముస్తఫిజుర్‌ రావడంలేదు

2 Feb, 2017 01:15 IST|Sakshi
ముస్తఫిజుర్‌ రావడంలేదు

ఢాకా: భుజం గాయం నుంచి కోలుకున్నప్పటికీ సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేని కారణంగా... బంగ్లాదేశ్‌ యువ సంచలన పేస్‌ బౌలర్‌ ముస్తఫిజుర్‌ రెహమాన్‌ను భారత్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం ఎంపిక చేయలేదు. ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును బుధవారం ప్రకటించారు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ముస్తఫిజుర్‌కు గత ఆగస్టులో భుజానికి శస్త్రచికిత్స జరిగింది.

నాలుగు నెలల విరామం తర్వాత ఇటీవలే న్యూజిలాండ్‌ పర్యటనలో ముస్తఫిజుర్‌ పునరాగమనం చేశాడు. ‘ముస్తఫిజుర్‌కు ఫిట్‌నెస్‌ సమస్య లేకపోయినా వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే పూర్తి స్థాయి సిరీస్‌కు అతని సేవలు అవసరమవుతాయి. ముందు జాగ్రత్తగానే అతడిని భారత్‌తో జరిగే టెస్టు కోసం ఎంపిక చేయలేదు’ అని బంగ్లాదేశ్‌ చీఫ్‌ సెలెక్టర్‌ మిన్హాజుల్‌ అబెదిన్‌ వివరించారు.

బంగ్లాదేశ్‌ టెస్టు జట్టు: ముష్ఫికర్‌ రహీమ్‌ (కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మెహ్మదుల్లా రియాద్, ఇమ్రుల్‌ కైస్, షకీబ్‌ అల్‌ హసన్, మెహదీ హసన్‌ మిరాజ్, మోమినుల్‌ హక్, షబ్బీర్‌ రెహమాన్, లిటన్‌ దాస్, తస్కీన్‌ అహ్మద్, శుభాషిస్‌ రాయ్, తైజుల్‌ ఇస్లామ్, కమ్రుల్‌ ఇస్లామ్‌ రబ్బీ, షఫీయుల్‌ ఇస్లామ్‌.

మరిన్ని వార్తలు