‘మై హోం’కు హైదరాబాద్ ఫ్రాంచైజీ!

21 Oct, 2015 01:51 IST|Sakshi
‘మై హోం’కు హైదరాబాద్ ఫ్రాంచైజీ!

ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ బ్యాడ్మిం టన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2013లో తొలి సీజన్ జరిగిన అనంతరం వివిధ కారణాలతో ఐబీఎల్‌ను నిర్వహించలేదు. దీంతో 2016 జనవరిలో రెండో సీజన్‌ను జరిపేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. ఆరింట్లో ఐదు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలి సీజన్ విజేత హైదరాబాద్ హాట్‌షాట్స్‌ను రియల్టీ సంస్థ మై హోమ్ గ్రూప్ దక్కించుకున్నట్టు సమాచారం.

గతంలో ఈ జట్టు పీవీపీ యాజమాన్యంలో ఉండేది. లక్నో (అవధే వారియర్స్) జట్టును సహారా ఇండియా పరివార్ నిలబెట్టుకోగా ఢిల్లీ స్మాషర్స్‌ను ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ (ఐసీఎస్) జట్టు దక్కించుకుంది.  అలాగే బెంగళూరును జిందాల్ గ్రూప్, చెన్నైని సైకిల్ అగర్‌బత్తి, ముంబైని ఓ రియాల్టీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు