'మా అమ్మ చాలా భయపడింది'

21 Aug, 2016 10:55 IST|Sakshi
'మా అమ్మ చాలా భయపడింది'

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో తన స్కోరు పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ నాలుగో స్థానంలో నిలవడం కొద్దిగా నిరుత్సాహానికి గురిచేసిందని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేర్కొంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పోడియంకు చేరడమే నా తదుపరి లక్ష్యమని చెప్పింది. జమ్నాస్టిక్స్ లో తన విన్యాసాలు చూడడానికి తన తల్లి భయపడిందని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన క్రీడాకారుడని తెలిపింది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం దీపా కర్మాకర్ ను ఘనంగా సన్మానించారు. తనకు అండగా నిలిచివారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. జిమ్మాస్టిక్స్ లో తాను ఏదైతే సాధించిందంతా కోచ్ బిశ్వేశ్వర్ నంది ఘనత అని ప్రకటించింది.

మరిన్ని వార్తలు