‘నా ఫస్ట్‌ టార్గెట్‌ పాండ్యానే’

1 Apr, 2018 12:40 IST|Sakshi

న్యూఢిల్లీ: త్వరలో ఆరంభం కానున్న ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా పలువురు ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలతో కలిసి ఇప్పటికే  కసరత్తులు ప్రారంభించారు. ఇందులో బ్యాట్స్‌మెన్‌ తమ పవర్‌ హిట్టింగ్‌ షాట్లకు పదును పెడుతుండగా, బౌలర్లు తమ మెదడుకు పని చెబుతూ కచ్చితమైన బౌలింగ్‌ కోసం​ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన మ్యాజిక్‌ స్పిన్‌కు మరింత వన్నె తెచ్చెందుకు కృషి చేస్తున్నాడు.

వాటిలో ముందుగా ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యానే తన మొదటి లక్ష్యమంటూ ట్విటర్‌ ద్వారా చమత్కరించాడు. దీనికి సంబంధించి షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను కూడా చాహల్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా అతని‌ ట్వీట్‌కు సరదాగా స్పందిస్తున్నారు.

మరిన్ని వార్తలు