'ఆమె నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకొంది'

3 Mar, 2015 10:46 IST|Sakshi
'ఆమె నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకొంది'

తన భార్య కరాబీ తనను సంపూర్ణంగా అర్థం చేసుకుందని ఎడమ చేతివాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు.  తన బౌలింగ్పై నిషేధం అనంతరం తొలిసారి ఓజా నోరు విప్పాడు. తన బౌలింగ్పై నిషేధం విధించాక పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయానని, ఒక్కసారిగా పడిపోయినట్లు అనిపించిందని చెప్పారు. తాను అంత నిరుత్సాహంలో ఉన్నా కరీబా ఎప్పుడూ అలాంటి భావాలను తన ముఖంలో చూపించకుండా ఓ సాధారణ అమ్మాయిలాగే ఉందని, తనను చాలా ఎంకరేజ్ చేసిందని చెప్పారు.  ఆమె అలా చేయడం వల్లే కష్టమైన సమయాన్ని కూడా తాను తేలికగా తీసుకోగలిగానని చెప్పాడు.

సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా  ప్రజ్ఞాన్ ఓజాపై బిసిసిఐ 28 డిసెంబర్ 2014న నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు చెన్నైలోని ఐసీసీ గుర్తింపు సెంటర్‌లో ఓజా బౌలింగ్ శైలిని పరీక్షించగా అతడు మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఈ పరీక్షలో తేలింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం బంతులు విసిరేటప్పుడు స్పిన్నర్ బౌలర్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు. దీంతో అతడి బౌలింగ్పై నిషేధం విధించారు. అయితే, ఇటీవల జరిగిన రంజీ ట్రోపీలో ఉత్సాహంగా రాణిస్తూ నాలుగు వికెట్లు కూడా తీశాడు. ఇది తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ అని, ఇబ్బందుల్లోనూ అధైర్య పడకుండా ఉండేలా స్నేహితులు, భార్య వెన్నంటి ఉండటం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.

మరిన్ని వార్తలు