సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్

30 Sep, 2014 10:30 IST|Sakshi
సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్

హైదరాబాద్: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. చాంపియన్స్ లీగ్ టి20లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్- డాల్ఫిన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ చాంపియన్స్ లీగ్ టి20 ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, షాంషుద్దీన్ లతో పాటు థర్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన కూడా నరైన్ క్వికర్ డెలివరీపై సందేహాలు వ్యక్తం చేశారని తెలిపింది. నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత నరైన్ కు అంపైర్లు తెలిపారని పేర్కొంది. నరైన్ తన బౌలింగ్ శైలి సక్రమంగా ఉందో, లేదో నిరూపించుకోవాల్సివుంది.

మరిన్ని వార్తలు