ఆ ఓవర్‌లో లంకకు ‘మూడింది’

4 Jun, 2019 16:55 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక మరోసారి తడ‘బ్యాటు’కు గురైంది.  అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకకు శుభారంభం లభించినా ఆ జట్టు ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్గాన్‌ స్పిన్నర్‌ మహ్మద్‌ నబీ వేసిన 22 ఓవర్‌లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్‌ మెండిస్‌(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో లంక 146 పరుగుల వద్ద నాల్గో వికెట్‌నష్టపోయింది. లంక కోల్పోయిన తొలి నాలుగు వికెట్లు నబీ ఖాతాలో పడటం మరో విశేషం. సంచనాలకు మారుపేరైన అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌లో విజృంభిస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌​ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా,  తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక ఎదురీదుతోంది. 149 పరుగుల లంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. హమీద్‌ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

మరిన్ని వార్తలు