నదీమ్‌కు 10 వికెట్లు!

27 Jul, 2019 13:07 IST|Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత-ఏ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ షహ్‌బాజ్‌ నదీమ్‌ చెలరేగిపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన  నదీమ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఐదు వికెట్లు సాధించి విండీస్‌ పతనాన్ని శాసించాడు. దాంతో విండీస్‌ యువ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. 159 పరుగుల వరకూ కుదురుగా కనబడిన విండీస్‌.. ఆపై నదీమ్‌ స్పిన్‌కు విలవిల్లాడింది. తన స్పిన్‌ మాయాజలంతో విండీస్‌కు నదీమ్‌ చెమటలు పట్టించగా, అతనికి జతగా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పదునైన బంతులతో హడలెత్తించాడు. దాంతో విండీస్‌ 21 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది.

ఫలితంగా భారత్‌-ఏ జట్టుకు 97 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ జట్టు వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది.  ఇంకా భారత్‌ విజయానికి 68 పరుగులు మాత్రమే కావాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 312 పరుగులకు ఆలౌట్‌ కాగా, వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. నదీమ్‌ ఐదు వికెట్లు సాధించడంతో విండీస్‌ రెండొందల మార్కును చేరడానికి ఆపసోపాలు పడింది.  తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌కు రెండు వికెట్లు లభించాయి.

>
మరిన్ని వార్తలు