‘డ్రా’తో గట్టెక్కిన భారత్ ‘ఎ’

21 Aug, 2015 23:54 IST|Sakshi

దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టు  
 కరుణ్ నాయర్ సెంచరీ
 వాయనాడ్ (కేరళ): ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టును డ్రాగా ముగించగలిగింది. 73/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు శుక్రవారం ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 309 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (192 బంతుల్లో 114; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు.
 
 విజయ్ శంకర్ (142 బంతుల్లో 74 నాటౌట్; 12 ఫోర్లు), ముకుంద్ (200 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అతనికి అండగా నిలిచారు. చివరి రోజు విజయానికి భారత్ 371 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఇది కష్ట సాధ్యం కావడంతో భారత్ మ్యాచ్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. నాయర్, శంకర్ ఐదో వికెట్‌కు అభేద్యంగా 148 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించగా...రెండో రోజు ఆటలో భారత కెప్టెన్ రాయుడు (15) మాత్రమే విఫలమయ్యాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు