ప్రి క్వార్టర్స్‌లో థాపా, నానో సింగ్

20 Oct, 2013 01:37 IST|Sakshi
ప్రి క్వార్టర్స్‌లో థాపా, నానో సింగ్

అల్మాటి (కజకిస్థాన్): యువ బాక్సర్ శివ థాపా, థోక్‌చోమ్ నానో సింగ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. అయితే 2009 ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ ఈసారి మాత్రం రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. విజేందర్ 79 కేజీ విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన యూరోపియన్ చాంపియన్ జేసన్ క్విగ్లే చేతిలో ఓడిపోయాడు.
 
 తొలి రెండు బౌట్స్‌లో ఒక్కో పాయింట్ వెనుకబడిన విజేందర్ చివరి బౌట్‌లో హెచ్చరికకు గురయ్యాడు. మరోవైపు తొలి రౌండ్‌లో బై లభించిన నానో (49 కేజీ విభాగం) 3-0 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన అకీల్ అహ్మద్‌ను మట్టికరిపించాడు. నాలుగో సీడ్ శివ థాపా 56 కేజీ విభాగంలో ఫిలిపినో మారియో ఫెర్నాండెజ్‌ను ఓడిం చాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో నానో సింగ్ ఐదో సీడ్ ఆంటోనీ చకోన్ రివెరా (ప్యూర్టోరికో)తో, శివ థాపా అర్జెంటీనాకు చెందిన ఆల్బర్టో మెలియన్‌తో తలపడతారు. మన్‌ప్రీత్ (91కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.
 

మరిన్ని వార్తలు