జొకోవిచ్, ఒసాకా ఇంటిముఖం 

4 Sep, 2019 11:01 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్లు జొకోవిచ్‌ (సెర్బియా), ఒసాకా (జపాన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్‌ ఓడిపోయే దశలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 23వ సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో అతను 4–6, 5–7, 1–2 స్కోరు వద్ద రిటైర్ట్‌హర్ట్‌ అయ్యాడు. రెండో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–3, 3–6, 6–1, 6–2తో సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు.  

సెమీస్‌లో స్వితోలినా 
మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–4, 6–4తో 16వ సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌)పై నెగ్గి యూఎస్‌ ఓపెన్‌లో తొలిసారి సెమీస్‌ బెర్త్‌ సంపాదించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా 5–7, 4–6తో 13వ సీడ్‌ బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు