సెరెనాను ట్రోల్‌ చేసిన ఒసాకా

16 Jan, 2020 12:28 IST|Sakshi

మెల్‌బోర్న్‌: తల్లి అయ్యాక తొలి టైటిల్‌ను అందుకున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడటానికి సన్నద్ధమయ్యారు. దీనికంటే ముందుగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. కాగా, జపాన్‌ స్టార్‌ క్రీడాకారిణి నయామి ఒసాకా మాత్రం సెరెనాను ట్రోల్‌ చేసింది. సెరెనాతో కలిసిన దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే సెరెనా తన తల్లి అంటూ ఒసాకా పేర్కొన్నారు. ‘నేను-మా మమ్మీ’ అంటూ ఒసాకా ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఒసాకాకు 22 ఏళ్లు కాగా, సెరెనాకు 39 ఏళ్లు. సెరెనాది తన తల్లి వయసు అనే విషయాన్ని ఒసాకా చెప్పకనే చెప్పేసింది.

మరి ఆస్ట్రేలియా ఓపెనర్‌లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. కచ్చితంగా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న సెరెనా.. ఒసాకాకు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఒసాకా డిఫెండింగ్‌ చాంపియన్‌గా పోరుకు సన్నద్ధం అయ్యింది. ఇదిలా ఉంచితే, 2018 యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ను ఒసాకా సాధించారు. ఈ సీజన్‌ ఆరంభపు గ్రాండ్‌ స్లామ్‌ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌ జనవరి 20వ తేదీ నుంచి ఆరంభం కానుంది.  ఇటీవల ఆక్లాండ్‌ వేదికగా జరిగిన ఏఎస్‌బీ క్లాసిక్‌ ఓపెన్‌ టోర్నీలో సెరెనా సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6–3, 6–4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు