నాసర్, అభ్యాస స్కూల్‌ జట్లకు టైటిల్స్‌

18 Aug, 2017 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐసీఎస్‌ఈ–ఐఎస్‌సీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో జూనియర్‌ బాలుర విభాగంలో నాసర్‌ స్కూల్‌ (గచ్చిబౌలి), సీనియర్‌ బాలుర విభాగంలో అభ్యాస ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (తూప్రాన్‌) జట్లు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాయి. సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో సీనియర్‌ బాలుర వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను వినీత్‌ కుమార్‌ (సెయింట్‌ జోసెఫ్, కింగ్‌కోఠి)... జూనియర్‌ బాలుర వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాయిప్రణీత్‌ (ఇంటర్నేషనల్‌ స్కూల్, షేక్‌పేట) గెల్చుకున్నారు. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి.

సీనియర్‌ బాలుర విభాగం

50 మీటర్ల ఫ్రీస్టయిల్‌: 1. గర్వ్‌ జైన్‌ (హెచ్‌పీఎస్, బేగంపేట; 37.06 సెకన్లు), 2. మహేశ్వర్‌ (అభ్యాస), 3. కృష్ణ (అభ్యాస). 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌: 1. వినీత్‌ కుమార్‌ (సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్, కింగ్‌కోఠి; 1ని:23.19 సెకన్లు), 2. జషిన్‌ బన్సల్‌ (అభ్యాస), 3. గర్వ్‌ జైన్‌. 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. గర్వ్‌ జైన్‌ (53.37 సెకన్లు), 2. జషిన్‌ బన్సల్, 3. ధాయ్‌పులె అమిత్‌ సాయి (అభ్యాస). 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. ధాయ్‌పులె అమిత్‌ సాయి, 2. ఆయూష్‌ (సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్, కింగ్‌కోఠి), 3. వినయ్‌ ఝవర్‌ (సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌). 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌: 1. జషిన్‌ బన్సల్‌ (57.04 సెకన్లు), 2. అలీ రియాన్‌ (హెచ్‌పీఎస్, బేగంపేట), 3. రయాన్‌ (సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌). 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌: 1. రయాన్‌ (2ని:16.10 సెకన్లు), 2. అమిత్‌ సాయి, 3. కె. నరసింహ (అభ్యాస). 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: 1. వినీత్‌ కుమార్‌ (43.07 సెకన్లు), 2. సాయి రామ్‌ (అభ్యాస), 3. ఎం. వినయ్‌ రావు (షేర్‌వుడ్‌ పబ్లిక్‌ స్కూల్‌). 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: 1. వినీత్‌ కుమార్, 2. మహేశ్వర్‌. 4/100 మీటర్ల రిలే: 1. అభ్యాస స్కూల్, 2. సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్, 3. హెచ్‌పీఎస్, బేగంపేట.

జూనియర్‌ బాలుర విభాగం

50 మీటర్ల ఫ్రీస్టయిల్‌: 1. మొహమ్మద్‌ ఖమీలుద్దీన్‌ (నాసర్‌ స్కూల్, గచ్చిబౌలి; 35.03 సెకన్లు), 2. రాహుల్‌ సింగ్‌ (సుజాత స్కూల్, మొయినాబాద్‌), 3. ధ్రువ్‌ ఖన్నా (జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్, నాచారం). 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌: 1. సాయిప్రణీత్‌ కుమార్‌ (1ని:14.99 సెకన్లు), 2. ప్రద్యోత్‌ (నాసర్‌ స్కూల్‌), 3. భావిక్‌ కౌశిక్‌ (నాసర్‌ స్కూల్‌). 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. వంశీ వర్ధన్‌ (సుజాత స్కూల్, మొయినాబాద్‌; 39.83 సెకన్లు), 2. ఖమీలుద్దీన్, 3. యువరాజ్‌ కుమార్‌ (హెచ్‌పీఎస్‌). 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌: 1. ప్రద్యోత్‌ (1ని:31.60 సెకన్లు), 2. యువరాజ్‌ కుమార్, 3. రాజా అభిరామ్‌ రెడ్డి (అభ్యాస స్కూల్‌). 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌: 1. యువరాజ్‌ కుమార్‌ (42.45 సెకన్లు), 2. రాఘవ్‌ (హెచ్‌పీఎస్‌), 3. రోహిత్‌ (ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌). 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌: 1. రాఘవ్‌ (హెచ్‌పీఎస్, బేగంపేట; 1ని:35.77 సెకన్లు), 2. ప్రద్యోత్, 3. కె. తన్మయ దుర్గేశ్‌ (రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌).  50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: 1. సాయిప్రణీత్‌ (37.76 సెకన్లు), 2. రాఘవ్, 3. ఖమీలుద్దీన్‌. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: 1. సాయిప్రణీత్‌ (1ని:31.91 సెకన్లు), 2. రాజా అభిరామ్‌ రెడ్డి (అభ్యాస స్కూల్‌). 4/100 మీటర్ల రిలే: 1. నాసర్‌ స్కూల్, 2. హెచ్‌పీఎస్‌ 3. సుజాత స్కూల్‌.

 

మరిన్ని వార్తలు