నటాషా సీమంతం ఫొటో వైరల్‌!

9 Jun, 2020 15:19 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందనే శుభవార్తను అభిమానులతో పంచుకున్న నాటి నుంచి.. వరుసగా ఫొటోలు షేర్‌ చేస్తున్నాడు ఈ స్టార్‌ క్రికెటర్‌. ఇక తాజాగా నటాషా కూడా ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘మమ్మీ టు బీ’’అనే అక్షరాలున్న వైట్‌ కలర్‌ థీమ్‌ డెకరేషన్‌ చూస్తుంటే.. నటాషా బేబీ షవర్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. హార్దిక్‌, నటాషాలతో పాటు ఫొటోలో ఉన్న మూడు కుక్క పిల్లలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముచ్చటైన కుటుంబం మీది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.(అప్పుడే డేటింగ్‌ మొదలు : హార్దిక్‌)

కాగా ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియా మోడల్‌ నటాషాతో పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఈ జంట ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇద్దరూ మెడలో పూలమాలలతో ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో వాళ్లిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే పాండ్యా ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడటం తనకు సవాలేనని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని హార్దిక్‌ ఇటీవల వెల్లడించాడు.

🌍 ❤️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు