పాండ్యా, నటాషా నిశ్చితార్థం.. మాజీ ప్రియుడి స్పందన

2 Jan, 2020 12:11 IST|Sakshi

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం వీరిద్దరు తమ రింగ్స్‌ మార్చుకున్నారు. అనంతరం నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అని హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశాడు. వీరిద్దరికీ సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. వీరిద్దరికి హార్ట్‌సింబల్‌ను (ఎమోజీ) బహుమతిగా పోస్ట్‌ చేశాడు. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం హార్ట్‌ సింబల్‌ను మాత్రమే షేర్‌ చేశాడు. గతంలో కొంతకాలం నటాషా, గోని ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. (నటాషాతో హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌)


ఈ యువ జంటకు ధోని, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. స్వతహాగా మంచి డాన్సర్ అయిన నటాషా.. ‘సత్యాగ్రహ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బిగ్ బాస్ 8 లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు