79 ఏళ్ల ఆసీస్ రికార్డు బ్రేక్

5 Sep, 2017 12:04 IST|Sakshi
79 ఏళ్ల ఆసీస్ రికార్డు బ్రేక్

చిట్టగాంగ్:ఆస్ట్రేలియా స్పిన్నర్ నాధన్ లయన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న లయన్.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించారు. దాంతో లయన్ కు తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు లభించాయి. లయన్ దెబ్బకు విలవిల్లాడిన బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 305 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంచితే, తొలి రో్జు ఆటలో పేస్ బౌలర్ తో కలిసి లయన్ బౌలింగ్ ను ఆరంభించడంతో 79 ఏళ్ల ఆసీస్ రికార్డు ఒకటి బద్దలైంది. ఇలా ఒక పేస్ బౌలర్ తో కలిసి స్పిన్నర్ బౌలింగ్ ను మొదటి రోజు ఉదయమే పంచుకోవడం ఆసీస్ క్రికెట్ చరిత్రలో 1938 తరువాత ఇదే తొలిసారి.  తద్వారా ఆసీస్ మాజీ స్పిన్నర్ బిల్ ఓ రెల్లీ రికార్డును లయన్ బ్రేక్ చేశారు.

బంగ్లాదేశ్ తో టెస్టులో తొలి ఓవర్ ను పేసర్ ప్యాట్ కమిన్స్ వేయగా, రెండో ఓవర్ ను లయన్ వేశారు. ఇలా తొలి రోజు ఉదయం పేసర్ తో కలిసి బౌలింగ్ ను పంచుకున్న లయన్ చెలరేగిపోయారు. తొలి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను తీసి తన స్పిన్ మ్యాజిక్ ను ప్రదర్శించారు.  నిన్నటి ఆటలో ఓవరాల్ గా ఐదు వికెట్లను సాధించిన లయన్.. మొదటి నాలుగు వికెట్లను ఎల్బీడబ్ల్యూ రూపంలో సాధించడం ఇక్కడ మరో విశేషం.
 

మరిన్ని వార్తలు