‘టీమిండియాతో పోరును ఎంజాయ్‌ చేస్తాం’

9 Feb, 2019 15:28 IST|Sakshi

మెల్‌బోర్న్‌: త్వరలో భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న స్పిన్నర్‌ నాధన్‌ లయన్‌.. వరల్డ్‌కప్‌కు ముందు సాధ్యమైనంత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటం తమకు కచ్చితంగా మంచి అవకాశమన్నాడు. అందులోనూ భారత్‌లాంటి పటిష్టమైన జట్టుపై ఆడటం యువకులతో కూడిన తమ జట్టును మరింత రాటుదేలేలా చేస్తోందన్నాడు. తమ జట్టులో ప్రతీ ఒక్కరూ భారత్‌తో పోరును ఎంజాయ్‌ చేయడం ఖాయమన్నాడు.

‘వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువ వైట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడటం మాకు సువర్ణావకాశమే. భారత పర్యటనలో మా ప్రణాళికలు కచ్చితంగా ఉంటాయనే అనుకుంటున్నా. ఇది మాకు చాలా పెద్ద చాలెంజ్‌. భారత్‌లో ఆ జట్టుకు అనుకూలించే పిచ్‌లపై ఆడటం సవాల్‌తో కూడుకున్నది. నా వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్స్‌ ఆదివారం నుంచి ఆరంభం కానుంది.  నా పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించడానికి వంద శాతం కృషి చేస్తా.  నేను సిడ‍్నీ సిక్సర్స్‌కు ఆడినా, ఆస్ట్రేలియాకు ఆడినా జట్టుకు ఉపయోగపడేలా ఆడటమే నా లక్ష్యం’ అని లయన్‌ తెలిపాడు.  ఫిబ‍్రవరి 24వ తేదీ నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. రెండు టీ20ల సిరీస్‌, ఐదు వన్డేల సిరీస్‌లు ఇరు జట్లు తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు