ప్రణీతకు రజతం

26 Dec, 2013 01:08 IST|Sakshi

జమ్‌షెడ్‌పూర్: తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక కుమారి జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆరోసారి చాంపియన్‌గా నిలి చింది. బుధవారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6-4తో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి వర్ధినేని ప్రణీతపై గెలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన వరంగల్ జిల్లాకు చెందిన ప్రణీత ఈ పోటీల్లో తన ఖాతాలో మూడో పతకాన్ని జమ చేసుకుంది.
 
 50 మీటర్ల ఈవెంట్‌లో ప్రణీత రజతం సంపాదించగా... 30 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ఆడుతోన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ చిట్టిబొమ్మ జిజ్ఞాస్ బృందానికి కాంస్యం లభించింది. జిజ్ఞాస్, సందీప్, రతన్ సింగ్, గోవింద్‌దాస్‌లతో కూడిన సర్వీసెస్ జట్టు 227 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్‌కు స్వర్ణం, హిమాచల్‌ప్రదేశ్‌కు రజతం దక్కాయి.
 

మరిన్ని వార్తలు