మన ‘పట్టు’ పెరిగింది

23 Sep, 2019 03:24 IST|Sakshi

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన

తొలిసారి ఐదు పతకాలు

దీపక్‌కు రజతం, రాహుల్‌కు కాంస్యం

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ తమ అత్యుత్తమ పతక ప్రదర్శనతో ఘనతకెక్కింది. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈ పోటీల్లో ఐదు పతకాలను సాధించింది. స్వర్ణం బరిలో నిలిచిన దీపక్‌ పూనియా (86 కేజీలు) పోటీకి దూరమయ్యాడు. గాయంతో అతను తలపడలేకపోయాడు. దీంతో రజతంతో తృప్తిచెందాల్సి వచ్చింది. రాహుల్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో ఇదివరకే బజరంగ్‌ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), మహిళల కేటగిరీలో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా భారత్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో 79 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. రష్యా (190 పాయింట్లు), కజకిస్తాన్‌ (103 పాయింట్లు), అమెరికా (94 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

గతంలో భారత్‌ మెరుగైన ప్రదర్శన 3 పతకాలే! 2013 ప్రపంచ రెజ్లింగ్‌లో భారత్‌ ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గింది. ఈవెంట్‌కు చివరి రోజైన ఆదివారం జరిగిన 61 కేజీల కాంస్య పతక పోరులో రాహుల్‌ అవారే ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ మహారాష్ట్ర రెజ్లర్‌ 11–4తో 2017 పాన్‌ అమెరికా చాంపియన్‌ టైలర్‌ గ్రాఫ్‌ (అమెరికా)ను మట్టికరిపించాడు. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో రాహుల్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా చాంపియన్‌íÙప్‌ (2009, 2011)లలో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. 86 కేజీల విభాగం ఫైనల్లో ఇరాన్‌ రెజ్లర్‌ హసన్‌ యజ్దానీతో పోటీపడాల్సిన యువ రెజ్లర్‌ దీపక్‌ పూనియా చీలమండ గాయంతో బరిలోకి దిగలేదు. దాంతో యజ్దానిని విజేతగా ప్రకటించగా, దీపక్‌ ఇప్పటి వరకు భారత్‌ నుంచి దీపక్‌ సహా ఐదుగురే రెజ్లర్లు ప్రపంచ పోటీల్లో ఫైనల్‌ చేరగా... సుశీల్‌ (2010) మాత్రమే విజేతగా నిలిచాడు. బిషంబర్‌ సింగ్‌ (1967), అమిత్‌ దహియా (2013), బజరంగ్‌ (2018) ఫైనల్లో ఓడిపోయారు.  

>
మరిన్ని వార్తలు