రిఫరీ తక్కువ రేటింగ్‌ ఇస్తే.. సచిన్‌ ఫుల్‌ మార్క్స్‌ వేశాడు

23 Dec, 2018 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల టీమిండియా-భారత్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు జరిగిన అనంతరం ఐసీసీ మ్యాచ్‌ రెఫరీ రంజన్‌ మదుగలే పెర్త్‌ పిచ్‌కు తక్కువ రేటింగ్‌ ఇస్తే.. మన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం ఆ పిచ్‌కు ఫుల్‌ రేటింగ్‌ ఇచ్చాడు. ‘క్రికెట్‌లో పిచ్‌లు పాత్ర చాలా ఉంటుంది. మరీ ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పిచ్‌లే  విజయాల్ని నిర్దారిస్తాయి. అదే సమయంలో మంచి ఆసక్తి కూడా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లుకు జరిగే సమరంలో పిచ్‌లే పరీక్షపెడతాయి. మనలోని టాలెంట్‌ బయటకు రావాలంటే పిచ్‌ను బ్యాలెన్స్‌గా రూపొందించాలి. అలా రూపొందించిందే పెర్త్‌ పిచ్‌. ఈ తరహా పిచ్‌లను మరిన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. పెర్త్‌ పిచ్‌ ఎంతమాత‍్రం యావరేజ్‌ పిచ్‌ కాదు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇక మాజీ క్రికెటర్లు మిచెల్‌ జాన్సన్‌, మైఖేల్‌ వాన్‌ విమర్శనాస్త్రాలు సైతం పెర్త్‌ పిచ్‌పై సంధించారు. పెర్త్‌ పిచ్‌లో లోపమేమీ కనిపించడం లేదని జాన్సన్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఇది ఫ్లాట్‌ పిచ్‌ కాదు. ఈ పిచ్‌పై బ్యాట్‌కు బంతికి మధ్య ఎల్లప్పుడు ఆసక్తికర పోటీ సాగుతుంది. అసలు మంచి పిచ్‌ అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉందని’ జాన్సన్‌ ట్వీట్‌ చేశాడు. ‘పెర్త్‌ అద్భుతమైన పిచ్‌. బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్‌లకు ఈ పిచ్‌ సహకరిస్తుంది’ అని వాన్‌ ట్విట్టర్లో తెలిపాడు.

పెర్త్‌ పిచ్‌కు అత్తెసరు మార్కులే! 

>
మరిన్ని వార్తలు