‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’

7 Oct, 2019 13:11 IST|Sakshi

కరాచీ:  సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులోకి పునరాగమనం చేసిన అహ్మద్‌ షెహజాద్‌, ఉమర్‌ అక్మల్‌లకు ఆ జట్టు ప్రధాన కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ వచ్చిన సత్తాచాటుకోవాలంటే కష్టమని మిస్బా పేర్కొన్నాడు. కనీసం వారిద్దరూ టచ్‌లోకి రావడానికి కనీస మద్దతు ఇస్తే  వారు తమ పూర్వ ఫామ్‌ను అందిపుచుకుంటారన్నాడు. అంతేకానీ ఏదో ఒకటి రెండు ప్రదర్శనలతో తర్వాత ఆ ఇద్దరిపై విమర్శలు వారి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించాడు. ఇక ఒత్తిడిలో ఉన్న పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అండగా నిలిచాడు మిస్బావుల్‌ హక్‌.

‘ప్రమాదంలో ఉన్నవారు సాయం కోసం ప్యానిక్‌  బటన్‌ నొక్కినట్లు షెహజాద్‌, ఉమర్‌ అక్మల్‌ విషయంలో చేయకండి. వారు తిరిగి ఫామ్‌లోకి వస్తారు. దయచేసి మరింత ప్రమాదంలోకి నెట్టవద్దు. వారి నుంచి ఆశించిన ప్రదర్శన రావాలంటే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక సర్ఫరాజ్‌ను ఒత్తిడి నుంచి బయట పడేయటం కూడా నా విధుల్లో భాగం’ అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో షెహజాద్‌, ఉమర్‌ అక్మల్‌లు విఫలమైన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో  విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిస్బావుల్‌ మాట్లాడుతూ.. ఒక్క ప్రదర్శన కారణంగా విమర్శలు చేయడం తగదన్నాడు. వచ్చే  టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు