‘నేను అధ్యక్షుడ్ని కాదు.. రెగ్యులర్‌ కెప్టెన్‌ను కాదు’

2 Nov, 2019 16:49 IST|Sakshi

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చింది.  రోహిత్‌కు ఊహించని ప్రశ్న ఎదురు కావడంతో కాస్త అసహనంతో మాట్లాడాడు. ఇటీవల విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మను విమర్శిస్తూ టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ చేసిన వ్యాఖ్యలపై రోహిత్‌ను మీడియా అడిగింది. అనుష్కకు టీ కప్‌లు అందివ్వడానికి మన సెలక్షన్‌ కమిటీ ఉందంటూ ఫరూక్‌ విమర్శించగా, అది పెద్ద రచ్చ అయ్యింది. (ఇక్కడ చదవండి: అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?)

దీనిపై అనుష్క శర్మ సైతం మండిపడటంతో ఫరూక్‌ క్షమాపలు చెప్పారు. అయినప్పటికీ దీనిపై రోహిత్‌ను అడగటంతో ఆవేశంగా మాట్లాడాడు. ‘ నేనైమైనా అధ్యక్షుడ్నా(బీసీసీఐ).. లేక రెగ్యులర్‌ కెప్టెన్‌ హోదాలో ఉన్నానా. ఈ విషయంపై ఏమి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి. మీకు వివరణ కావాలంటే ఫరూక్‌ సర్‌నే అడగండి. అతను ఏమి చెప్పడో మీకు తెలుస్తుంది. దీనిపై నేను ఏమీ మాట్లాడలేను. నేను మాట్లాడటానికి ఏముంది. ఫరూక్‌ సర్‌ ఏమి చెప్పాడనే విషయంలో తలదూర్చను’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: మీ అందరికీ నేనే దొరికానా?: అనుష్క ఫైర్‌)

మరిన్ని వార్తలు