భారత్‌ ప్రత్యర్థి నెదర్లాండ్స్‌ 

12 Dec, 2018 01:06 IST|Sakshi

క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మాజీ చాంపియన్‌  

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్‌తో క్వార్టర్స్‌లో తలపడేందుకు మాజీ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌ 5–0తో కెనడాను, బెల్జియం కూడా 5–0 స్కోరుతో పాకిస్తాన్‌ను చిత్తు చేశాయి. దీంతో పాక్‌ కథ ముగియగా, బెల్జియం క్వార్టర్స్‌ చేరింది. కెనడాతో జరిగిన పోరులో నెదర్లాండ్స్‌ తరఫున తిజ్‌ వాన్‌ డామ్‌ (40, 58వ ని.) రెండు గోల్స్‌ సాధించగా, లార్స్‌ బాక్‌ (16వ ని.), రాబర్ట్‌ కెంపెర్మన్‌ (20వ ని.), తిరీ బ్రింగ్‌మన్‌ (41వ ని.) తలా ఒక గోల్‌ చేశారు.

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం తరఫున అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (10వ ని.), కెప్టెన్‌ థామస్‌ బ్రిల్స్‌ (13వ ని.), సెడ్రిక్‌ చార్లిర్‌ (27వ ని.), సెబాస్టిన్‌ డాకిర్‌ (35వ ని.), టామ్‌ బూన్‌ (53వ ని.) ఒక్కో గోల్‌ సాధించారు. గురువారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్‌; బెల్జియంతో జర్మనీ తలపడతాయి.   
 

మరిన్ని వార్తలు