నచ్చారండి.. హిమదాస్‌

21 Jul, 2019 19:54 IST|Sakshi

నచ్చారండి హిమదాస్‌.. తెగ నచ్చేశారు. దేశమంతా క్రికెట్‌ ప్రపంచకప్‌ పిచ్చిలో మునిగి మీ గెలుపును గుర్తించకున్నా.. మీరు మాత్రం వరుస పతకాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించారు‌. మీ విజయానికి రావాల్సినంత పేరు రాకున్నా.. దాన్ని మీ చిరునవ్వుతోనే సరిపెట్టుకున్నారు‌. మొబైల్‌లో టెంపుల్‌ రన్‌ గేమ్‌ ఆడుతూ బిజీగా ఉన్న మేము.. మీ పరుగును పట్టించుకోకున్నా.. మీరు ముందుకు సాగారు. ప్రకృతి కన్నెర్ర చేసి మీ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంటే.. కోట్లు సంపాదించే ఆటగాళ్లు ట్వీట్లతో సరిపెడితే.. మీరు మాత్రం మీకు తోచిన సాయం చేసి పెద్ద మనుసు చాటుకున్నారు‌.. సరిగ్గా ఏడాది క్రితం.. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో చిరుతలా పరుగెత్తి స్వర్ణ పతకం నెగ్గారు.

ఈ గెలుపుతో ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యారు. ఈ రేసులో నెగ్గిన వెంటనే మీరు జాతీయ పతాకం కోసం అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం మాకు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మీ ప్రతిభను దేశ ప్రధానే కొనియాడుతుంటే.. మీకు నజరానాలు.. కానుకల వర్షం కురుస్తందని భావించాం. ప్చ్‌.. అందరూ ప్రశంసలతోనే సరిపెట్టినా.. మీరు ఏ మాత్రం అసంతృప్తికి లోనవ్వలేదు. మీ పరుగును ఆపలేదు. ఆ ప్రశంసలను తలకెక్కించుకోలేదు. అంతేకాకుండా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించారు. తమ ప్రతిభను గుర్తించడం లేదని, నజరానాలు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఆటగాళ్లున్న ఈ రోజుల్లో.. ఇన్ని విజయాలందుకున్న మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండడం.. చిరునవ్వుతో ముందుకు సాగడం అందర్నీ ఆకట్టుకుంది. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో మొదలైన మీ జైత్రయాత్ర.. నిన్నటి చెక్‌ రిపబ్లిక్‌ అంతర్జాతీయ అ‍థ్లెటిక్స్‌ మీట్‌ వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఇది ఇలానే టోక్యో ఒలింపిక్స్‌-2020 వరకు కొనసాగాలని.. భారత్‌కు స్వర్ణపతకం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

ముగిసిన మేఘన పోరాటం

తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్‌’ ప్రదర్శన

శివ థాపా పసిడి పంచ్‌

సెమీస్‌లో పేస్‌ జంట

మెయిన్‌ ‘డ్రా’కు శ్రీజ

విండీస్‌ పర్యటనకు ధోని దూరం

తెలుగు టైటాన్స్‌ తడబాటు

టైటిల్‌కు విజయం దూరంలో...

తొలి వేట యు ముంబాదే..

అక్షర్‌ అదరగొట్టినా.. తప్పని ఓటమి

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

ఆడింది తొమ్మిదే.. ​కానీ ర్యాంకేమో

ఏషియన్‌గేమ్స్‌ రజతం.. బంగారమైంది!

46 నిమిషాల్లోనే ముగించేసింది..

విండీస్‌ టూర్‌: వీరికి అవకాశం దక్కేనా?

ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

గుప్తాకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా

రష్యా ఓపెన్‌: సెమీస్‌లో మేఘన జంట

ఆటకు ‘సెలవు’.. సైన్యంలోకి ధోని

ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్‌

హవ్వా.. అదేం బౌలింగ్‌ అశ్విన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి