భారత ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ కొత్త చరిత్ర 

27 Jul, 2018 02:07 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖతో కూడిన భారత కాంపౌండ్‌ టీమ్‌ కొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను, ముస్కాన్‌ కిరార్, దివ్య, మధుమితాలతో కూడిన కాంపౌండ్‌ జట్టు తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది.

ఇటీవల బెర్లిన్‌లో ముగిసిన ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నమెంట్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు రజతం గెలుచుకుంది.  దీంతో 342.6 పాయింట్లతో  అగ్రస్థానానికి చేరి నయా చరిత్ర లిఖించింది. చైనీస్‌ తైపీ టీమ్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఘనతలో తెలుగు తేజం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో పాల్గొన్న ఆమె నాలుగింటిలోనూ పతకాలు నెగ్గింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు