మరో క్రికెట్‌ అభిమాని జాక్‌పాట్‌!

1 Mar, 2018 13:48 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మెరుపులు మెరిపించగా, ఒక అభిమానికి మాత్రం కాసుల వర్షం కురిసింది. బెన్‌ స్టోక్స్‌ కొట్టిన భారీ షాట్‌ను అందుకున్న ఒక న్యూజిలాండ్‌ అభిమాని రూ. 24 లక్షలు(50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా టిమ్‌ సౌతీ వేసిన 36 ఓవర్‌లో ఒక డెలివరీని స్టోక్స్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా బౌండరీ అవతలికి పంపిచాడు. ఆ క్యాచ్‌ను న్యూజిలాండ్‌ అభిమాని కుడిచేత్తో పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అదే సమయంలో అతను న్యూజిలాండ్‌ అభిమాని కావడంతో కాస్త ఎక్కువ జోష్‌లో మునిగిపోయాడు. కాగా, ఆ క్యాచ్‌కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దగ్గించుకోవడం మ్యాచ్‌ చివర్లో కొసమెరుపు. స్థానిక శీతల పానీయ సంస్థ అతనికి క్యాష్‌ ప్రైజ్‌ను అందజేసింది.ఇలా ఈ ఏడాది ఒక అభిమాని క్యాచ్‌ అందుకుని భారీ మొత్తాన్ని గెలుచుకోవడం నాల్గోసారి.

మరిన్ని వార్తలు